కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ .. బద్వేల్ బై ఎలక్షన్స్‌లో తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు. తమది విలువలతో కూడుకున్న పార్టీయన్న జనసేనాని… సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన స్థానంలో అభ్యర్థిని నిలుపబోమని చెప్పారు. స్థానికంగా ఉండే జనసేన నాయకులతో చర్చించిన తర్వాతే.. పోటీపై నిర్ణయం తీసుకున్నామన్నారు పవన్ కల్యాణ్. మరణించిన ఎమ్మెల్యే భార్యకే.. టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ…
ఈనెల 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటించారు. అయితే, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయమని ఒత్తిడి వచ్చిందని, చనిపోయిన…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాలోని నల్ల చెరువులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చానని అన్నారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీ నాయకులు తనకు శతృవులు కాదని, అద్భతమైన పాలన ఇచ్చి ఉంటే ఇలా…
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడును పెంచుతున్నారు. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ జనాల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా జనసేన ఇటీవల కొన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్నలను పొందే ప్రయత్నం చేస్తోంది. జనసేన తొలి విడుతగా తీసుకున్న రోడ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తుంది. ఇదే…
పవన్ కళ్యాణ్ లాగా శ్రమ దానం చేయటంలో ఇదొక కొత్త ట్రెండ్ అని మంత్రి కన్నబాబు అన్నారు. సరిగ్గా ఒక నిమిషం 8 సెకన్లు శ్రమదానం పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆయనది కెమెరా, యాక్షన్ లాంటి వైఖరి కాదా అని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజున వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అనటం ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ మీద యుద్ధం దేని కోసం ప్రకటించారు. కోవిడ్ కష్టకాలంలో కూడా లక్ష కోట్ల రూపాయలు నేరుగా…
పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని… అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు.. రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు. ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయి పోతుందా ? అని ప్రశ్నించారు సజ్జల. కొండ ఎవరో ఎత్తు తుంటే చివరలో వేలు పెట్టి నేనే ఎత్తుతున్నాను అన్నట్లు ఉందని…
సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో హిట్ అందుకున్నారు. ఇదే సమయంలో వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటై ఫుల్ బీజీగా మారిపోయాడు. దీంతో ఆయన రాజకీయంగా కొంత సైలంట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా జనసేనాని రాజకీయంగానూ దూకుడు చూపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ కు రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2014 ఎన్నికల…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తూర్పు గోదావరి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగసభకు అనుమతి లేదని అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు.. సభా వేదిక మార్చుకోవాలని సూచించినట్టు అడిషనల్ ఎస్పీ తెలిపారు.. బాలాజీపేటలో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. మరోవైపు అనుమతిలేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది జనసేన.. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమధానం కార్యక్రమం వేదిక మార్చామని.. అనుమతి…
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్‌తో చర్చించారు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు.…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి శంకరనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సినిమా కాల్షిట్లు లేకపోతే రాజకీయలు గుర్తుకు వస్తాయి అని కామెంట్ చేసారు. టీడీపీ, జనాసేన ఉనికి కోల్పోతున్న నేఫధ్యంలో రోడ్లు పై రాజకీయాలు చేస్తూన్నాయి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు ప్రక్కదారి పట్టించడంతోనే… రోడ్లకు ఈ దుస్థితి వచ్చింది అని ఆరోపించారు. సోము వీర్రాజుకు అవగాహన లేక కేంద్ర నిధులు ప్రక్కదారి పట్టాయని విమర్శిస్తూన్నారు. వచ్చే ఏడాది…