పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ టీడీపీని కలవర పెడుతున్నాయా? ఈ మధ్య కాలంలో టీడీపీని జనసేనాని ఎక్కడా విమర్శించకపోయినా.. ఆందోళన ఎందుకు? పవన్ చూపిస్తున్న సింపతీపై తమ్ముళ్ల లెక్కలేంటి? లెట్స్ వాచ్..! టీడీపీని జనసేనాని తిట్టకపోయినా.. తమ్ముళ్లలో టెన్షన్..! కొంతకాలంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సీఎం జగన్ మీద.. YCP ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికారపార్టీ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. అలాగే పవన్ ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి రాజకీయం కాస్తో కూస్తో వేడెక్కుతూనే ఉంది.…
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం.…
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు చంద్రబాబు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి ప్రైవేటీకరణకు ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151…
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు.…
తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ ఆరోపించారు. ఏపీలో తమ…
కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తోంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనానికి జనసేనే గుర్తుకు రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని మేం శత్రువుగా చూడడం లేదు.. కానీ ఆ ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే మేం విమర్శలు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే పచ్చి బూతులు తిడతారు.. ఇంట్లో వాళ్లని తిడతారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏదో చిన్న పరిశ్రమ కాదు.. ఆత్మగౌరవం. నేను బీజేపీతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవాలని…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు…
నాడు ఓట్లు వేయించి గెలిపించిన పార్టీ కార్యకర్తలు నేడు ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. పార్టీ మారిపోయానని చెప్పి రెండేళ్లుగా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. గెలిపించిన పార్టీ కార్యకర్తలు మాత్రం ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆ ఎమ్మెల్యేను వెంటాడుతునే ఉన్నారట. అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్నారట. ఇదంతా అధికార పార్టీ నేతే వెనకుండి నడిపిస్తున్నారని తెలిసి.. సొంతపార్టీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారట. రాపాకను ఇరకాట పెట్టే పనిలో జనసైనికులు? తూర్పుగోదావరి…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్ధతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి స్టీల్ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని పదేపదే చెబుతూ వస్తోంది. కేంద్రం తీరు మార్చుకోకపోవడంతో ఇవాళ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు పవన్ . ఉదయం 10 నుంచి సాయంత్రం…