ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి…
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన టీడీపీ ఆ పనిని సరిగ్గా నిర్వర్తించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో తప్ప టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. దీంతో ఆపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం క్రమంగా ఆపార్టీ గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టగా మరికొంతమంది…
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన గురించే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా వైసీపీ, జనసేన మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. జనసేన చేపట్టిన రోడ్ల ఉద్యమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ విషయంలో ఒకరకంగా జనసేనాని వైసీపీ సర్కారుపై పైచేయి సాధించిందనే టాక్ సైతం విన్పించింది. ఇదే సమయంలో జనసేనాని వీలుచిక్కినప్పుడల్లా ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రతీగా వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతూ రాజకీయాలను…
బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకున్నది. నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీలో ఉన్న పార్టీలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయాల్సి ఉన్నా, గత సంప్రదాయాలను గౌరవిస్తూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నది. అయితే, జనసేన తప్పుకోవడంతో బీజేపీ పోటీకి సిద్ధమైంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పార్టీ బీజేపీకి ప్రచారం చేస్తుందా లేదా అనే అంశంపై నిన్నటి వరకు సందేహం ఉన్నది. జనసేన పార్టీ నేత నాదెండ్ల…
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా అభ్యర్థిని కూడా ప్రకటించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరులో నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో మరోసారి సురేష్‌ను ఉప ఎన్నికల్లో అభ్యర్ధిగా బీజేపీ ఎంపికచేసింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్నికల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ…
ఏపీలో కొత్త పొత్తులకు బీజం పడిందా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే వెళ్తున్నాయా? బద్వేలు ఉపఎన్నికలో పోటీ విషయమై మిత్రులు భిన్నదారులు వెతుక్కుంటే.. వేర్వేరు దారుల్లో ఉన్నవారు ఏకతాటిపైకి వస్తున్నారా? బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా? ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రిప్లబిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత పొలిటికల్ కలర్స్ ఎటెటో వెళ్తున్నాయి. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ క్రమంలో బూతులు..…
కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం…
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన…
బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేనను పోటీ చేయాలని కోరినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పింది అని వివరించిన ఆయన కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం… కాబట్టి బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరాం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందో లేదోననే అంశంపై ఆ పార్టీతో చర్చిస్తాం.…
బద్వేలు ఉప ఎన్నికలును పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్ పార్టీ కి భయపడాల్సిన పని లేదని… బద్వేలు సమీపంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. జగన్, చంద్రబాబు ఈ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్లు వేశారా… ఆంధ్రప్రదేశ్ ను ఏడు ఏళ్లుగా నరేంద్ర మోదీ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు..రాష్ట్రంలో ఏడేళ్ల అభివృద్ధి పై చర్చించడానికి బీజేపీ సిద్ధమని… జగన్, చంద్రబాబుకు దీనిపై చర్చించడానికి…