ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ జగన్ మత్స్యకారుల కష్టాలు గాలికొదిలేశారన్నారు. మత్స్యకార్ల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం చేపలు అమ్ముకోవడం ఏమిటి? జీవో 217తో నాలుగున్నర లక్షల మంది మత్స్యకారుల ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందన్నారు. మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి జనసేన లక్ష్యం. ఎన్నికల ముందు మత్స్యకార్లకు ఇచ్చిన హామీలు సీ.ఎం జగన్ ఎందుకు నెరవేర్చడం లేదని మనోహర్ ప్రశ్నించారు. కాకినాడ సూర్యారావుపేటలో జనసేన మత్స్యకార అభ్యున్నతి…
తెలుగు సినీ ప్రముఖులు-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… మంగళగిరిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌రెడ్డిది విచిత్ర ధోరణి.. కపట మనస్తత్వం అంటూ మండిపడ్డారు.. సమస్యను సృష్టిస్తారు… తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసిన ఆయన.. సినీ ప్రముఖుల్ని పిలిచి పబ్లిసిటీ స్టంట్ చేశారని సెటైర్లు వేశారు.. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి?…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఆయన.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారు. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్…
ఏపీలో విచిత్రమయిన రాజకీయం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రధాన కులాలకు పోటీగా మిగతా కులాల నేతలు ఏకీకరణకు ప్రయత్నిస్తున్నారు. నాన్ రెడ్డి, నాన్ కమ్మ నేతల ఏకీకరణ ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కాపునేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఆలోచనకు తెర తీస్తే, దానికి మద్దతు పలికారు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అయితే ఇవి వైసీపీకి లబ్ధిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగా మరో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఆరోపించారు.…
కీలక సమావేశాన్ని వాయిదా వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 9వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన కార్యనిర్వాహక సమావేశం జరగాల్సి ఉంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, ఇతర అంశాలతో పాటు వివిధ వర్గాలు ఎదుర్కొంటన్న సమస్యలపై చర్చించాలనుకున్నారు. Read Also: జగ్గారెడ్డి దీక్ష రద్దు మరోవైపు.. పార్టీ…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. Read Also: రూపాయి…
రాష్ట్రంలో పేదలకు కడుతున్న ఇళ్ళపై సీపీఐ రామకృష్ణ విమర్శలకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పిచ్చుక గుళ్ళు లాంటి ఇళ్లు కడుతున్నారని విమర్శిస్తున్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే మీకెందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఇంతకంటే పెద్ద ఇళ్లు కట్టారా? సిద్దాంతాల గురించి మాట్లాడే బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వస్తారు. వీళ్ళ మధ్యలో టీడీపీ.దాని వెనుక తోకపార్టీ జనసేన నడుస్తున్నాయన్నారు.ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలకు…
మరికొద్ది గంటల్లో మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నూతనం… ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని… అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ పేర్కొన్నారు. ఇటువంటి 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితో…
ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్‌ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బుద్ధుడి విగ్రహాన్ని…