ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుండా ఆ గ్రామస్తులు నడుం బిగించారు. రోడ్డు వేసుకుని తమ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం అరవపాలెం గ్రామంలో స్వచ్ఛందంగా రోడ్లు వేసుకున్న గ్రామస్తులు. వీరికి జనసైనికులు తమవంతు సాయం చేశారు. అరవ పాలెం నుండి చింతలపల్లి రోడ్డు అధ్వానంగా మారడంతో సొంత ఖర్చులతో చందాలు వేసుకుని రోడ్లు చదును చేస్తుకున్నారు గ్రామస్తులు.
గత కొన్నేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదు. దీంఓ తామే రంగంలోకి దిగాలని భావించారు. స్వయంగా రంగంలోకి దిగిన జనసైనికులు గ్రామస్తులు, రైతులు శ్రమదానంతో రోడ్డు వేసుకున్నారు. వేల ఎకరాల్లో పంట పండించే రైతులు రోడ్లు అధ్వానంగా ఉండడంతో రోడ్లు వేసుకోవడం ఒక్కటే మార్గంగా భావించారు. ఏపీలో అనేక గ్రామాలకు వెళ్ళే రహదారులు దారుణంగా పాడైపోయాయి. అధికారులకు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదు. దీంతో గ్రామస్తులే రోడ్డు వేసుకుని ఆదర్శంగా నిలిచారు.