ఏలూరు రోడ్డులోని పాత బస్టాండు వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూధన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనదేశం, మనరాష్ట్రం.. ఆ తరువాతే మనందరమన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనందరం నిలబడాలని…
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం…
మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డుపై తొడగొట్టారు జనసేన నేతలు.. మంత్రి రోజాపై చేసినా అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, అరెస్ట్ చేసిన కిరణ్ రాయల్‌ను నగరి కోర్టులో హాజరు పర్చారు పోలీసులు.. కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది… 41ఏ నోటీసు కిరణ్ రాయల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన…
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు..…