రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విస్తృత స్థాయీ సమావేశం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దుర్మార్గపు పాలనను కొత్తగా వచ్చిన పదేళ్ల పార్టీ ఎలా ఎదుర్కొబోతోందో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుపుకొనే వేడుక.. పెళ్లి అనగానే అమ్మాయిలు, అబ్బాయిలు ఊహల్లో తేలిపోతారు..ఇక ఎవరి స్థోమతను బట్టి వాళ్లు ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి.. అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు.. ఇలాంటి జంటలే అన్యోన్యంగా ఉంటారు.. ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారు.. అయితే కొందరు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి స్టార్ట్ కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు ఈ వారాహి యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.