Ketamreddy Vinod Reddy: జనసేనకు మరో షాక్.. పార్టీకి కేతంరెడ్డి గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketamreddy Vinod Reddy: జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది.. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తప్పడంలేదు.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాల్గో విడత వారాహివిజయ యాత్రను కృష్ణా జిల్లాలో విజయవంతం చేశారు.. అయితే, వరుస రాజీనామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి.. నిన్నటికి నిన్న జనసేన పార్టీకి రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి రాజీనామా చేశారు.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే, మూడు నెలల క్రితం పిఠాపురం ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది జనసేన పార్టీ అధిష్టానం.. దీంతో.. మనస్థాపానికి గురైన మాకినీడి శేషుకుమారి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. మరోవైపు.. నెల్లూరు ఇప్పుడు జనసేన పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు..
Read Also: Rohit Sharma: రికార్డులపై ఎక్కువగా దృష్టి పెట్టను.. అలా చేస్తే..: రోహిత్ శర్మ
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
జనసేన పార్టీకి నెల్లూరు సిటీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు వెల్లడించారు.. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి.. ఓటమి పాలయ్యారు.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వచ్చారు.. ఇక, ఆ మధ్య వినోద్ రెడ్డితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపి పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన వైసీపీలోకి ఆహ్వానించడంతో వినోద్ రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతోనే కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జిగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు.. మరోసారి ఆయన బరిలోకి దిగబోతున్నారు.. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ఆయన.. జనసేన పార్టీకి రాజీనామా ప్రకటించినట్టు సమాచారం.
జనసేన పార్టీకి రాజీనామా. జైహింద్.@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/0dMXnmnvko
— Kethamreddy Vinod Reddy (@keathamreddy) October 12, 2023
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!