Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదని.. ఆనాడు…
ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో స్థానిక జనసేన పార్టీ నేత ఇంటిపై దాడి చేశారు దుండగులు… తమ డివిజన్‌లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు ఇంటిలోకి దూరి అధికార పార్టీకి చెందిన నేత అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు జనసేన పార్టీ నేతలు.. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది.. ఒక్కసారిగా ఇంటిలోకి దూరి ఇంట్లోని ఫర్నిచర్, సామాన్లు ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు.. ఊహించని ఘటనతో జనసేన నేత,…
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు.. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులని పేర్కొన్న పవన్.. కర్తవ్య పథ్ అనేది భారతీయత ఉట్టిపడే నామ ధేయం.. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది.. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు…
Pawan Kalyan: చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతు రత్నం నాయుడు మృతి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అలసత్వానికి రైతు బలైపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడి ఉండేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అక్రమ కేసులు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటివి పట్టించుకునే సమయమే లేదని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం…
Pawan Kalyan: జనసేన నేత పోతిన వెంకట మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిన మహేష్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని.. రాష్ట్రంలో పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని పవన్ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని.. జెండా దిమ్మలు పగుల కొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టరని పోలీసులను పవన్ ప్రశ్నించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ వర్గాలు…
Pawan Kalyan: ఏపీలో ఇప్పటికిప్పుడు సడెన్‌గా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. విశాఖలో పరిశ్రమల కాలుష్యం, విషవాయువు లికేజీ లాంటి అంశాల్లో మందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఘటనలకు బాధ్యులైనవారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, రిషికొండను ధ్వంసం చేసినా పట్టించుకోలేదని.. సడెన్‌గా పర్యావరణంపై ఇప్పుడు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు…
వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఏమీ ఉండకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పినట్టే అన్నారు.. ఇలా తెలిసే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో... ఎవరైనా చెబితే చేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.. పవన్ కల్యాణ్ వైసీపీ విముక్త ఏపీ అంటూ కలలు కంటున్నారు.. అలాగే కననివ్వండి అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది.. ఏదైనా మాట్లాడొచ్చు అన్నారు.. మరోవైపు.. గడపగడపకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉందో తెలుసుకునే అవకాశం వస్తుంది……