ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో స్థానిక జనసేన పార్టీ నేత ఇంటిపై దాడి చేశారు దుండగులు… తమ డివిజన్‌లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు ఇంటిలోకి దూరి అధికార పార్టీకి చెందిన నేత అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు జనసేన పార్టీ నేతలు.. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది.. ఒక్కసారిగా ఇంటిలోకి దూరి ఇంట్లోని ఫర్నిచర్, సామాన్లు ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు.. ఊహించని ఘటనతో జనసేన నేత, ఆయన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.. ఇక, ఓ గ్యాంగ్ వచ్చి విధ్వంసం సృష్టించడంతో.. భయంతో వణికిపోయామని చెబుతున్నారు స్థానికులు.. ఈ దాడిలో పలువురు జనసేన పార్టీకి చెందిన మహిళలకు గాయాలు అయినట్టు తెలుస్తుండగా.. సమాచారం అందుకున్న జనసేన నేతలు కిరణ్ రాయల్, సుభాషిని… ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.. అయితే, తిరుపతిలోని ఎస్కే బాబు వర్గానికి చెందిన వారు దాడికి దిగినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.. జనసేన అనే మాట ఇక్కడెక్కడ వినిపించకూడదు, ఇక్కడ అంతా మా పార్టీలోనే ఉండాలంటూ హెచ్చరించారని చెబుతున్నారు.. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.
Read Also: Astrology : సెప్టెంబర్ 14, బుధవారం దినఫలాలు