మూడు రాజధానుల చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు పాదయాత్ర చేపట్టారు. మూడు రాజధానులకే మా మద్దతు అని వైసీపీ చెబుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.. పీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.. అయితే, మా వ్యూహాలు మాకున్నాయి.. పరిస్థితులను బట్టి వ్యూహాలు మారుతుంటాయి.. అవసరాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటామని ప్రకటించారు పవన్.. అంతటితో ఆగకుండా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు జనసేనాని.. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను కలిపేస్తానని కేసీఆర్…
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… జనసేన పీఏసీ ఇవాళ సమావేశమైంది.. సమావేశంలో ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. నాలుగు గంటల పాటు సాగిన పొలిటికల్ ఎఫైర్స్ సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని.. ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హానికరం.. వైసీపీ విముక్త ఏపీ నినాదంతో ఎన్నికలకు వెళ్తామని వెళ్లడించారు.. వైసీపీ సృష్టించే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన…