MLA Arava Sridhar: జనసేన కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ పూర్తి.. ఇక నిర్ణయం అధినేత చేతుల్లో!
- జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి
- మహిళా ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ
- గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్ కమిటీ ముందు హాజరు.
- తన వాదనతో పాటు ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arava Sridhar: మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం.
Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్!
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే కోడూరుకు చేరుకుని ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ప్రత్యక్షంగా విచారించింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన విచారణలో శ్రీధర్ తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇచ్చిన వివరణ, సమర్పించిన ఆధారాల వివరాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. గత కొన్ని రోజులుగా మహిళతో కలిసి ఉన్న వీడియోలు, అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన క్లిప్స్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారడంతో వెంటనే శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయినప్పటికీ, అందిన సమాచారం ప్రకారం.. శ్రీధర్ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహిస్తానని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది. విచారణలో ఎమ్మెల్యే ఇచ్చిన ఆధారాలు, వివరాలను కమిటీ సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికను నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగా మరికొందరిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో ఆరోపణలు చేసిన మహిళ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఆరోపణలు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా శ్రీధర్ వర్గం కూడా స్పందిస్తూ రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ రెండు వాదనల మధ్య కమిటీ తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదంపై జనసేన అధిష్టానం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!