Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారని అంతా భావించిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించలేదు. ఎన్డీయే సునామీలో ఆర్జేడీ లాగే ప్రశాంత్ కిషోర్(పీకే) కొట్టుకుపోయారు. అయితే, పరాజయంపై తొలిసారిగా స్పందించిన పీకే పార్టీ, ఎన్డీయేపై సంచలన ఆరోపణలు చేసింది. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు…
Bihar Elections 2025: దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జన్ సురజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. పలు నివేదికల ప్రకారం.. పీకే పేరు బీహార్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలలో కనిపిస్తుంది. దీంతో రెండు ఓటరు ఐడి కార్డులు కలిగి ఉన్న కారణంగా ఎన్నికల కమిషన్ ఆయనకు తాజాగా నోటీసు జారీ చేసింది. దీనిపై కమిషన్ మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పీకేను కోరింది. READ…
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సోమవారం (అక్టోబర్ 13) రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే, రాఘోపూర్ స్థానం నుంచి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై ఎన్నికల్లో పోటీ చేయనున్న కిషోర్ పేరు జాబితాలో లేదు. మూడు దశాబ్దాలుగా నితీష్ కుమార్ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, చాలా కాలంగా ఆయనకు బలమైన కోటగా భావిస్తున్న హర్నాట్ స్థానం నుంచి…
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(పీకే)తో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతిసింగ్ ఇటీవల తన భర్తపై ఆరోపణలు చేసింది. పవన్ సింగ్‌పై ఇటీవల జ్యోతిసింగ్ వివాహేతర సంబందాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పీకేను కలవడం…
Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్‌యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Prashant Kishor: అమెరికాలోని బీహారీ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బీహార్ నిజంగానే విఫల రాష్ట్రం.. దీని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ పార్టీ (Jan Suraj Party)ని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన నేత ప్రశాంత్ కిషోర్ (పీకే) రెండున్నరేళ్లుగా బీహార్ లోని గ్రామాలను చుట్టేసిన తర్వాత ఈరోజు తన పార్టీని ప్రారంభించబోతున్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా జన్ సూరజ్ పాదయాత్ర కొనసాగుతుందని పీకే ప్రకటించారు. వచ్చే ఏడాది బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ చిత్రం ఎలా ఉంటుంది.? ఎవరు ప్రముఖ ముఖాలు .? అలాగే NDA-మహా కూటమి చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో…
Prashant Kishor: బీహార్ వేదికగా మరో పార్టీ రాబోతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పేరుతో పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన ఆదివారం వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వచ్చాయి.. ఎవరికి ఏ స్థానమో తేలిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాలు కూల్‌గా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.