నేడు బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు. ఎడ్లబండ్లపై సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు. సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్, BRS నేతలు. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు. ముంబైతో తలపడనున్న లక్నో. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్. ఢిల్లీ తో తలపడనున్న బెంగళూరు. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్. నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణభవన్‌లో పార్టీ జెండా ఎగరవేయనున్న కేటీఆర్.అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న కేటీఆర్.…
పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్ యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్నల్…
పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం అని తేల్చి చెప్పారు. కానీ, గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది అని ఆరోపించారు. ఇప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నాం…
జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఎల్‌జీ మనోజ్ సిన్హా హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిగా ఉన్నప్పటికీ.. గత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ మధ్య చాలా మంచి సమన్వయం కనిపించింది.
శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "గత కొన్ని రోజులుగా లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు & ఎన్‌కౌంటర్‌లు ఎక్కువగా జరుగుతన్నాయి. శ్రీనగర్‌లోని 'సండే మార్కెట్' వద్ద అమాయక దుకాణదారులపై గ్రెనేడ్ దాడికి సంబంధించిన ఈరోజు వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బారాముల్లా ఉగ్రదాడిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ శుక్రవారం స్పందించారు.
ఓ భారతీయ బాలిక అమెరికాలో తన ప్రతిభను చాటుకుంది. ఈ అమ్మాయి అమెరికాస్ గాట్ టాలెంట్‌లో తన నైపుణ్యంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడమే కాకుండా.. ఇక్కడ ఉన్న ప్రేక్షకులను అబ్బురపరిచింది. అమెరికాస్ గాట్ టాలెంట్ తాజా ఎపిసోడ్‌లో నిజంగానే సంచలనం సృష్టించిన ఈ అమ్మాయి పేరు అర్షియా శర్మ.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ దార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.