Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 5.9 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. లిథియం నాన్-ఫెర్రస్ మెటర్. సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.