Mehabooba Mufti: శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం బీజేపీ విడుదల చేసింది. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య ఈ జాబితాను ఉపసంహరించుకుంది. కొన్ని గంటల తర్వాత సవరించిన జాబితాను మళ్లి విడుదల చేసింది.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని 50కి పైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.