రెండు తెలుగు రాష్ట్రాల్లో వివకానందరెడ్డి హత్య కేసు కలకలం రేపుతోంది. ఎప్పుడు సీబీఐ అధికారులు ఎవరిని విచారణకు పిలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. వివేకా హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని బెదిరించి, దాడి చేసిన కేసులో అరెస్టు అయిన కొమ్మా పరమేశ్వర రెడ్డి, అతని కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని కోర్టుకు తరలించారు పోలీసులు. పులివెందుల కోర్టులో జడ్జి అందుబాటులో లేక పోవడంతో జమ్మలమడుగు కోర్టుకు నిందితులను తరలించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటుచేశారు.
వివేకా హత్య కేసులో నిందితుడు ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు. కసునూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారికి నిన్న పులివెందుల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులిద్దరిని జమ్మలమడుగు కోర్టులో నేడు హాజరు పరచారు. పోలీసులు. కొమ్మా పరమేశ్వర రెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉండటంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈకేసులో మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
Read Also: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు