విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం “జై భీమ్” మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సూర్య నటించిన రియలిస్టిక్ మూవీ ఇటీవలే ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యింది. అలాగే కొద్ది రోజుల క్రితం 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ సక్సెస్ ఫుల్ మూవీకి ఫిలిం నోయిడా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో 3 బెస్ట్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ మూవీ…
సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్’ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై మంచి సినిమాగా టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలను కూడా పొందుతోంది. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా సూర్య ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘జైభీమ్’ సినిమాను వీక్షించాడు. దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని లారెన్స్ కొనియాడాడు. Read Also: డిస్నీ హాట్ స్టార్ చేతికి “అఖండ” రైట్స్ ఓ దొంగతనం…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లాయర్ గా నటించిన సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న విడుదలైన ఈ సినిమాపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టే సీన్.…
ఈ వారం ఓటిటిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు టాప్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ కాబోతున్నాయి. నవంబర్ 4న దీపావళి ఉండగా, ఈ వారంలో విడుదల కానున్న సినిమాలు ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ కానున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి తెలుసుకుందాం. జై భీమ్ఈ ఇంటెన్సివ్ డ్రామాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది ‘జై భీమ్’. సామాజిక సందేశంతో…
తమిళ్ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైభీమ్’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 22న జై భీమ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెంకటేష్ హీరో నటించిన ‘గురు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ మూవీకి డైరెక్టర్. సూర్య హీరోగా ఆమె గతంలో ‘ఆకాశమే నీహద్దురా’ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కాగా జైభీమ్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ గత యేడాది కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. అదే సినిమాను ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సూర్య పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘జై భీమ్’. ఇది సూర్య నటిస్తున్న 39వ చిత్రం. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్య, తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 2డీ…