Jaggareddy: ఏఐసీసీ రెడ్డి లకు పీసీసీ ఇప్పుడు ఇవ్వద్దని అనుకుంది.. అందుకే బీసీ కి ఇచ్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి లకు ఇవ్వాలని అనుకుంటే జగ్గారెడ్డి చర్చ లోకి వస్తాడని కాంగ్రెస్ భావించిందని తెలిపారు. గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్ లో వినాయక చవితి పూజ కార్యక్రమానికి జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితోపాటు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఎంపికపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సీఎం..ఎస్సీ డిప్యూటీ సీఎం.. పీసీసీ బీసీ అని.. మూడు ప్రధాన పదవుల్లో మూడు కులాలకు ప్రాధాన్యత ఇచ్చింది పార్టీ అన్నారు.
Read also: CM Chandrababu: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కమ్మ సామాజిక వర్గంలో జెట్టి కుసుమ కుమార్ కి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత సీఎం రేవంత్ దే అన్నారు. బీజేపీ లో ప్రెసిడెంట్ అవ్వాలంటే కుదరదు అన్నారు. ఎప్పుడు పదవి వస్తుందో..ఎప్పుడు పోతుందో బీజేపీ లో తెలియదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలో వేరే వాళ్లకు అవకాశమే లేదన్నారు. ఐతే తండ్రి..లేకుంటే కొడుకే అధ్యక్షుడు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా రేవంత్..రెడ్డి సామాజిక వర్గం కాబట్టి…ఎన్ఎస్ యూఐ నుండి పార్టీ కోసం పని చేసిన బీసీ నేత కి పీసీసీ ఇచ్చింది ఏఐసీసీ అన్నారు. జగ్గారెడ్డి కి పీసీసీ కావాలనే ఆలోచన మారదన్నారు. స్వేచ్చగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ లోనే ఉంటుందన్నారు. ఏఐసీసీ రెడ్డి లకు పీసీసీ ఇప్పుడు ఇవ్వద్దని అనుకుంది… అందుకే బీసీ కి ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. రెడ్డి లకు ఇవ్వాలని అనుకుంటే జగ్గారెడ్డి చర్చ లోకి వస్తాడని.. కాంగ్రెస్ లో చాలా సంతోషంగా ఉన్న నేను అని అన్నారు. నాకు ఏ పోస్ట్ వస్తుంది అనేది నేను చర్చ చేయనని తెలిపారు. ఇవాళ వినాయక చవితి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా అన్నారు. మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పీసీసీ ఇచ్చింది అంటే కాంగ్రెస్ గొప్పతనం అది అని తెలిపారు.
CM Revanth Reddy: అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా.. ఇప్పుడు సీఎం హోదాలో..