సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వం చేసే మంచి పనులను పొగుడుతూ ఉంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను బహిరంగంగానే పొగిడారు. ఇదిలా ఉంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.…