దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,…
మిర్యాలగూడలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని, ఏ పార్టీలో ఉన్నా జానారెడ్డి పార్టీ టికెట్లు, పదవులు అడగలేదన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి తనకు అవకాశాన్ని ఆ పార్టీలు కల్పించాయని,…
Revanth Reddy: సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అని.. రబ్బర్ స్టాంపు లా నేను పని చేస్తున్ననని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్న అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy: పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అనుమతితోనే చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా..మోడీల ఆదేశాల మేరకు గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు అని, రాజస్థాన్ లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలి..లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు జగ్గా రెడ్డి. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ ని తిడితేనే హరీష్ ని…
కేసీఆర్ ఎండలకు ఆగం ఆగం చేస్తుండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులు ఇచ్చి బీజేపీ ఆగం ఆగం ఐతున్నారని, నిన్నటి నుండి బీజేపీ వాళ్ళకు నిద్ర లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ల రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అవసరమా అనే చర్చ బీజేపీ నేతలు చేశారని, ఇది వాస్తవమే కదా అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లు పై తెలంగాణ లో వ్యతిరేకత వచ్చిందని,…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్.. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టాలన్నారు. కేసీఆర్ బాధ కరెంట్ గురుంచి కాదు.. పొలిటికల్ పవర్ లేదని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటపుడు మూడు సార్లు కరెంట్ పోయింది అంటే ఎవరు నమ్మరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావాలి…
ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో నే జీవనోపాధి కలిపించిన పథకం తెచ్చింది సోనియా గాంధీ అని, ఉపాధి హామీతో గ్రామాభివృద్ధి.. జీవనోపాధి కల్పించినది సోనియమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ.. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు భోజనము పెట్టిన అక్షయ పాత్ర ఎట్లనో ఉపాది హామీ పథకం కూడా పేదలకు అక్షయ పాత్ర లాంటిదని, అలాంటి పేదల పథకం మోడీ పక్కన…
ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. రెండు రోజులుగా జరుగుతుంది ఇదే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని, సంబాని చంద్రశేఖర్.. లాంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చారన ఆయన తెలిపారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలాని పార్టీ సూచించిందని, నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరుతా అన్నా..చేర్చుకుంటామన్నారు జగ్గారెడ్డి.…