దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు వచ్చే చేశారా..? అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఎవరైనా పీసీసీ పదవి అడగొచ్చు.. ఈ స్వేచ్ఛ వేరే పార్టీలో ఉండదని, జవహర్ లాల్ నెహ్రు 40 కోట్ల దేశ జనాభాకు తినడానికి తిండి లేని రోజులు.. ఒక్కపూట తిని.. ఇంకో పూట పస్థులు ఉండే పరిస్థితి.. 40 కోట్ల జనాభా కి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారన్నారు. నెహ్రు ప్రధాని అయినప్పుడు దేశంలో కరెంట్ లేదు.. ప్రాజెక్టు లు లేవని, నెహ్రు ప్రాజెక్టు లు కట్టే పని పెట్టుకున్నారన్నారు. మన దగ్గర శ్రీశైలం.. నాగార్జున సాగర్ కట్టారని, కరెంట్ ఉత్పత్తి కూడా మొదలుపెట్టారన్నారు. నెహ్రు దూరపు చూపు తో ప్రాజెక్టులు.. విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారని, Fci ఏర్పాటు చేసింది నెహ్రు.. ధాన్యం నిల్వలకు ఆయనే నాంది పలికారన్నారు.
అంతేకాకుండా..’పారిశ్రామిక రంగాన్ని కూడా నెహ్రు ప్రోత్సహించారు. కాంగ్రెస్ హయాంలోనే srsp.. మంజీరా..సింగూరు లాంటి ప్రాజెక్టులు కట్టింది. బీజేపీ.. బీఆర్‌ఎస్ నేతలు.. 70 ఏండ్లలో ఏం చేశారు అంటున్నారు. కిషన్ రెడ్డి..కేసీఆర్ మంజీరా..సింగూరు నీళ్లు తాగినవాల్లే. ఇవి వాస్తవం కాదా..? కాంగ్రెస్ ఈ ప్రాజెక్టు లు కట్టలేదు అని చెప్పగలరా..? కిషన్ రెడ్డి కి సూటిగా ప్రశ్నిస్తున్న. మోడీ పదేళ్ళలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు..? ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? విశాఖ ఉక్కు తెచ్చింది మేము..అమ్మకానికి పెట్టింది మోడీ. బీజేపీ నేతలకు ఎన్ని కంపెనీలు పెట్టారో..ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పగలరా..? దమ్ముందా..ఏం చేశారో చెప్పుకునే దమ్ము ఉందా.? బీఆర్‌ఎస్ అంతా మేమే పెంచినం అంటే.. 60 ఏండ్లు పాలించిన వాడు ఏం చేయకుండానే ఈయన చేశాడా..? పీసీసీ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..తప్పు కాదు. బీజేపీ లో పదవులు అడిగితే..ఉన్న పదవి పోతుంది. బీఆర్‌ఎస్‌లో పదవి అడిగే పరిస్థితి ఉండదు.
కాంగ్రెస్ లోనే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా ఢిల్లీకి వెళ్లి పదవి అడిగే స్వేచ్ఛ ఉంది.’ అని జగ్గారెడ్డి అన్నారు.