వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. రూ.149 కోట్లతో అమరావతి - బెల్లంకొండ రోడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ హయాంలో సదావర్తి భూములు కాజేయాలని చూసారని... అమరావతి దేవుడి సాక్షిగా ఆ భూములను కాపాడానన్నారు. అంతేకాకుండా.. అచ్చంపేట మండలం సత్తెమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. అటవీ శాఖ అనుమతులు తెచ్చి రోడ్ వేస్తున్నామని తెలిపారు
దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యనించారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరినట్టుందని మండిపడ్డారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. దూరం నుంచే కొండను పరిశీలించిన పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, రుషికొండ నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసారు. తట్టెడు మట్టి తీస్తేనే పర్యావరణ ఇబ్బందులు వచ్చే చోట విధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అయితే సర్క్యూట్ హౌస్, ఇతర చోట్ల కట్టవొచ్చు కదా అని జనసేనాని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.
క్రికెటర్ గా అనూహ్యంగా రిటైర్ మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడం పై తీవ్ర అసంతృప్తికి గురయిన రాయుడు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.. కొంత కాలంగా అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీ పైన పెద్ద చర్చ జరిగింది.దీనిపై ఇప్పుడు రాయుడు క్లారిటీ ఇచ్చారనీ తెలుస్తుంది.తాను త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రజా సేవకు వెళ్లే ముందు జనం నాడి…
గత ఎన్నికల లో గెలుపుని లక్ష్యం గా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగుల కు కొన్ని హామీలను ప్రకటించారు జగన్. అందులో అతి ముఖ్యమైనది సిపిఎస్ విధానంను రద్దు పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే సిపిఎస్ విధానం రద్దు చేస్తానంటూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లు గానే జగన్ గత ఎన్నికలలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత గాని తెలియలేదు…
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో…