తాను ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల లోనే పుట్టానని.. తనతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ.. "నేను వస్తున్నానని తెలిసి, హెలికాప్టర్ రాకుండా హెలిపాడ్ తవ్వి వేశారు.
మోసాలు చేసేందుకు దోచుకునేందుకు కూటమి సిద్ధంగా ఉందని.. వారి మాటలను నమ్మే మోసపోవద్దని రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గిరిజనులకు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా అరకులోయలో వైసీపీ నిర్వహించిన రోడ్ షోకు ఆయన పాల్గొని మాట్లాడారు.
కాకినాడ గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారు అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. "జగన్ బినామీ ఇక్కడే ఉన్నాడు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదం ముదురుతోంది. ఈ చట్టం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల అస్త్రంగా మారిందని పలువురు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సభల్లో తమ ప్రసంగాల్లో భాగంగా ఈ యాక్ట్ గురించి నెగిటివ్ గా చెబుతున్నారు.
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి, వైసీపీ నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
నెల్లూరులో ఎంతటి ఉద్వేగాన్ని చూడలేదని.. ఇంత ప్రేమ అభిమానాలను చూపిస్తారని కలలో కూడా అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నారని.. నెల్లూరులో గల్లీ.. గల్లీ తిరిగిన వ్యక్తని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. “నాకు తిరుపతిలో గల్లి గల్లి తెలుసు పవన్ కళ్యాణ్ కు నెల్లూరులో అంతా తెలుసు. సింహపురిలో చరిత్ర తిరగ రాయబడుతుంది. టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే ఎవరైనా ఉంటారా. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం. ప్రజలకు బంగారు భవిష్యత్…