రెండున్నరేళ్ళ తర్వాత కేబినెట్ మారుస్తానని చెప్సిన జగన్ గ్రేస్ పీరియడ్ పెంచి మరో ఆరునెలల తర్వాత కేబినెట్ మార్చారు. అందులోనూ సగం మందిని వుంచేశారు. ఏపీలో కేబినెట్ కూర్పు పూర్తైంది.. శాఖల కేటాయింపు కంప్లీట్ అయింది. చాలా మంది మంత్రులు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు అప్పగించిన శాఖలు నచ్చక..…
మంత్రి పదవులు దక్కలేదని అలకబూనిన నేతలంతా దారికొస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం.. అధినేతకు విధేయులుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా అలక వీడారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి, కాపు రాచమంద్రారెడ్డి అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలకబూనిన ఒక్కో నేత… అధినేత దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పార్థసారథి,…
ఏపీలో ఇప్పుడంతా జగన్ కేబినెట్లో చోటు దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేల గురించే హాట్ టాపిక్ అవుతోంది. పదవి రాలేదని అలిగిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి సీఎం జగన్, పార్టీ దూతలు మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడారు. కోటరీ వల్ల తనకు పదవి రాలేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీవీతో ఏ విషయాలైతే మాట్లాడానో.. ఆ విషయాలన్నీ సీఎంకు వివరించాను. https://ntvtelugu.com/yanamala-ramakrishnudu-sattires-on-jagan-cabinet/ పార్టీలో కోటరి చేస్తున్న పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాను.…
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆయన్ని బతిమాలుతూ, బామాలుతూ,, సర్దిచెబుతున్నారు వైసీపీ నేతలు. సలహాదారు సజ్జల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ…
ఆర్ కె. రోజా..నగరి ఎమ్మెల్యేగా వున్న రోజాకు మంత్రిపదవి గ్యారంటీ అంటున్నారు. జగన్ కేబినెట్లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగా పాత మంత్రులకు 10 మందికి అవకాశం దక్కగా..కొత్తగా 15 మందిని ఎంపిక చేసారు. అందులోనూ చిత్తూరు జిల్లా నుంచి ఫైర్ బ్రాండ్ కి బెర్త్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. జాబితాలో ఆమె పేరు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో…
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక మార్పులు రానున్నాయా? కేబినెట్లో మార్పులు, చేర్పులకు రంగం రెడీ అయిందా? ముహూర్తం కూడా పెట్టేశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీంలో పెను మార్పులకు సిద్ధం అవుతున్నట్టు తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. మొదట మంత్రివర్గ ప్రక్షాళన, ఆతర్వాత పార్టీ ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. ఇదంతా పూర్తయ్యాక అధికారుల ప్రక్షాళన వైపు జగన్ అడుగులు వేస్తారని భావిస్తున్నారు. చివరలో తన కుటుంబానికి సంబంధించి అతి కీలక…