Deepfake: డీప్‌ఫేక్‌పై కేంద్ర సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఆన్‌లైన్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో డీప్‌ఫేక్ ముప్పును పరిశీలించడానికి, అటువంటి కంటెంట్‌ని గుర్తించడానికి, బాధిత పౌరులకు సాయం చేయడానికి కేంద్రం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రకి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
ట్విట్టర్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్నది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొన్నది. ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్‌లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్‌పై…
కొత్త నిబంధనలు ఇప్పుడు భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్టర్ చేసిన వ్యాఖ్యలను మరింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు ఎలాంటి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే వాటి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాలను గౌరవిస్తామని, ఏ దేశంలో కార్యకలాపాలు సాగించినా, అక్కడి స్థానిక చట్టాలకు అనుగుణంగా పని చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కోన్నారు. భారత్‌లో స్వేచ్చాయుత…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలకు తలొగ్గింది ఫేస్‌బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.. అయతే, మరికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జరగవలసి ఉందని వెల్లడించింది.. కాగా, కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను…