సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు ఎలాంటి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే వాటి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాలను గౌరవిస్తామని, ఏ దేశంలో కార్యకలాపాలు సాగించినా, అక్కడి స్థానిక చట్టాలకు అనుగుణంగా పని చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కోన్నారు. భారత్‌లో స్వేచ్చాయుత ఇంటర్‌నెట్ సుదీర్ఘకాలంగా వస్తున్న సంప్రదాయం అని, ప్రపంచంలో ఏ నియంత్రణ వ్యవస్థతో అయినా కలిసి పనిచేస్తామని, పూర్తి సహకారం అందిస్తామని గూగుల్ సీఈవో పేర్కోన్నారు.