సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
Fake Loan Apps: నకిలీ రుణ యాప్‌లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది.
Digital India Bill: ఇంటర్నెట్ ను నియంత్రించేందుకు, దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకురాబోతోంది.
ఓ యువతిని మోసం చేసిన ఉగాండా వ్యక్తిని పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన ఓ యువతికి ఉగాండాకు చెందిన “నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్” అనే వ్యక్తి ఫోన్ చేసి ఆన్‌లైన్ లాటరీలో రూ2.5 కోట్ల వచ్చాయని నమ్మించాడు. ఈ నేపథ్యంలో లాటరీ డబ్బులు రావాలంటే ట్యాక్స్‌లు కట్టాలంటూ సదరు యువతి నుంచి మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5…
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-A ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66-A కింద…