ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్‌లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్.. నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం
అయితే ఈ సమావేశానికి రావాలని ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి మోడీని ఆహ్వానించారు. కానీ ఈ సమావేశానికి మోడీ గైర్హాజరవుతున్నారు. భారత్ తరఫున విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను పంపిస్తున్నారు. గాజాలో యుద్ధం ముగించడం, పశ్చిమాసియాలో శాంతి, ప్రాంతీయ భద్రత, కొత్త శకానికి నాంది పలకడం ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇది కూడా చదవండి: Trump-Israel: బందీల విడుదల వేళ ట్రంప్‌కు అత్యున్నత పురస్కరం ప్రకటించిన ఇజ్రాయెల్
శాంతి సదస్సు హాజరయ్యే నాయకులు వీళ్లే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సీసీ
ఫ్రెంచ్ అధ్యక్షుడు: ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
యూకే ప్రధాన మంత్రి: కీర్ స్టార్మర్
ఇటాలీ ప్రధాన మంత్రి: జార్జియా మెలోని
టర్కిష్ అధ్యక్షుడు: రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్
స్పానిష్ ప్రధాన మంత్రి: పెడ్రో సాంచెజ్
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు: ఆంటోనియో కోస్టా
యూఎన్ సెక్రటరీ జనరల్: ఆంటోనియో గుటెర్రెస్
అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్: అహ్మద్ అబౌల్ ఘీట్
జోర్డాన్ రాజు అబ్దుల్లా II
కువైట్ ప్రధాన మంత్రి: అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబా
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా
ఇండోనేషియా అధ్యక్షుడు: ప్రబోవో సుబియాంటో
అజర్‌బైజాన్ అధ్యక్షుడు: ఇల్హామ్ అలీయేవ్
జర్మన్ ఛాన్సలర్: ఫ్రెడరిక్ మెర్జ్
గ్రీకు ప్రధాన మంత్రి: కిరియాకోస్ మిత్సోటాకిస్
అర్మేనియన్ ప్రధాన మంత్రి: నికోల్ పషిన్యన్
హంగేరీ ప్రధాన మంత్రి: విక్టర్ ఓర్బన్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి: షెహబాజ్ షరీఫ్
కెనడా ప్రధాన మంత్రి: మార్క్ కార్నీ
నార్వే ప్రధాన మంత్రి: జోనాస్ గహర్ స్టోర్
ఇరాక్ ప్రధాన మంత్రి: మహమ్మద్ షియా అల్-సుడానీ