ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల అమెరికాలో పర్యటించారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు రహస్య సమావేశాలు నిర్వహించారు.
నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని.. దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని నెతన్యాహు కొనియాడారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది.
హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానిని రెండు వైపులా చుట్టుముట్టారు. ఓ వైపు రఫాలో ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు గాజా విషయంలో నెతన్యాహుతో సొంత ప్రభుత్వ మంత్రులే విరుచుకుపడుతున్నారు.