Israel-Hamas War: పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ బలగాలు సిద్ధమవుతున్నాయి. శనివారం పదాతిదళాలను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
McDonalds Controversy: అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారాన్ని అందించే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
Israel-Hamas War: గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చాయి. డ్రోన్ దాడిలో టాప్ కమాండర అలీ ఖాదీని డ్రోన్ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇతను హమాస్ అత్యంత ముఖ్యమైన ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్.
ఇదిలా ఉంటే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నుంచి బందీలుగా పట్టుకున్న చిన్న పిల్లల్ని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాయుధులైన ఉగ్రవాదులు ఓ చేతిలో గన్స్, మరో చేతిలో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నారు. ఈ వీడియోను టెలిగ్రామ్ ఛానెల్ లో ప్రసారం చేశారు.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యానికి కీలక విజయం లభించింది. హమాస్ ఉగ్ర సంస్థ వైమానిక దళాల అధిపతి మరణించినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. గాజా స్ట్రిప్ లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కీలక హమాస్ నేత మరణించినట్లు తెలిపింది.
Israel-hamas War: గత శనివారం ఇజ్రాయిల్ పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దారుణ దాడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. గాజాకు సరిహద్దుల్లో
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ సైన్యం గాజాపై గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం అన్నారు. నివాస ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించడం సంక్లిష్ట విషయమని, ఇది తీవ్రపరిణామాలకు దారి తీస్తుందని అన్నారు. ముఖ్యంగా పౌరుల ప్రాణనష్టం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్ చరిత్రలోనే అత్యంత దారుణమై దాడిని ఎదుర్కొంది. హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయిల్ పై రాకెట్లు ద్వారా దాడులకు పాల్పడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని దారుణంగా హతమర్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
Israel-Hamas War: శనివారం ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. గాజాలోని బిల్డింగులతో పాటు యూనిర్సిటీలు, మసీదులు ఇలా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ మరణాల సంఖ్య 3000కి చేరింది. ఇజ్రాయిల్ లో 1200 మందికి పైగా మరణించారు. అంతేస్థాయిలో గాజాలోని ప్రజలు మరణిస్తున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. గత వారం శనివారం హమాస్ దాడి తరువాత పశ్చిమ ఆసియాలో కొత్త యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 5 దశాబ్దాలలో అత్యంత దారుణమైన దాడి తర్వాత, ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది.