Crude oil: ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం యుద్ధం ముగియడానికి స్పష్టమైన సంకేతాలు లేవు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది.
McDonalds Controversy: అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారాన్ని అందించే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
Asaduddin Owaisi: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
Israel-Hamas War: గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చాయి. డ్రోన్ దాడిలో టాప్ కమాండర అలీ ఖాదీని డ్రోన్ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇతను హమాస్ అత్యంత ముఖ్యమైన ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్.
Shehla Rashid: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నుంచి బందీలుగా పట్టుకున్న చిన్న పిల్లల్ని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాయుధులైన ఉగ్రవాదులు ఓ చేతిలో గన్స్, మరో చేతిలో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నారు. ఈ వీడియోను టెలిగ్రామ్ ఛానెల్ లో ప్రసారం చేశారు.
France: ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్ స్కూల్ లో శుక్రవారం కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయుడు మరణించాడు. అయితే ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. దాడి చేసిన వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 20 ఏళ్ల టీచర్ని దారుణంగా పొడిచి చంపాడు, మరో ఇద్దర్ని నిందితుడు గాయపరిచాడు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అనాగరికి…
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యానికి కీలక విజయం లభించింది. హమాస్ ఉగ్ర సంస్థ వైమానిక దళాల అధిపతి మరణించినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. గాజా స్ట్రిప్ లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కీలక హమాస్ నేత మరణించినట్లు తెలిపింది.
Israel-hamas War: గత శనివారం ఇజ్రాయిల్ పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దారుణ దాడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. గాజాకు సరిహద్దుల్లో