Shigella:ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలు దాటింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికులను ఒక వ్యాధి చుట్టుముట్టింది. ఇది వేగంగా విస్తరిస్తోంది.
Artificial intelligence (AI): ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. వైమానికి, భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుతోందనే నివేదికలు వెలువడ్డాయి. గాజాలోని హమాస్ లక్ష్యాలను టార్గెట్ చేయడంతో పాటు పౌరమరణాల సంఖ్యను ముందుగానే అంచనా వేయగానికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తోంది.
Anti-Semitism: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్ధులు పాలస్తీనా-హమాస్‌కి మద్దతుగా బహిరంగంగా మద్దతు తెలపడంతో పాటు యూదు విద్యార్ధులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి కొందరు లిబరల్స్ అని చెప్పుకునే వర్సిటీ టాప్ అధికారులు మద్దతు తెలుపుతున్నారు. ఇలా పలు వర్సిటీల్లో యూదు వ్యతిరేకత పెరగడంతో యూఎస్ కాంగ్రెస్ విచారణ చేసింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది.
Iraq: శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్‌పై రాకెట్లతో దాడి జరిగింది. ముఖ్యంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇవి డిస్ట్రిక్ట్ హౌసింగ్ గవర్నమెంట్, దౌత్య భవనాలకు దూరంగా పడినట్లు ఇరాక్ భద్రతా అధికారి తెలిపారు. అయితే ఈ రాకెట్లతో దాడి ఎవరు చేశారనే దానికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది.
PM Benjamin Netanyahu: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ మహిళలపై హమాస్ చేస్తున్న అత్యాచారాలు, దురాగతాలపై మాట్లాడటంతో ఇవన్నీ విఫలమయ్యాయని బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ మహిళలపై అత్యాచారారాలు, భయంకరమైన అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’’ అని ఎక్స్(ట్విట్టర్)ద్వారా ప్రశ్నించారు.
Israel Palestine Conflict : ఇజ్రాయెల్, హమాస్ మధ్య మరోసారి వివాదం మొదలైంది. కాగా, గాజా ఉగ్రవాదులు ఇంకా 138 మందిని బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తర్వాత మరోసారి యుద్ధం మొదలైంది. ఇంతలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై దాడి చేసింది. 45 మంది మరణించారు.. అనేకమంది గాయపడ్డారు.