Iraq: శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్‌పై రాకెట్లతో దాడి జరిగింది. ముఖ్యంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇవి డిస్ట్రిక్ట్ హౌసింగ్ గవర్నమెంట్, దౌత్య భవనాలకు దూరంగా పడినట్లు ఇరాక్ భద్రతా అధికారి తెలిపారు. అయితే ఈ రాకెట్లతో దాడి ఎవరు చేశారనే దానికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభం తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతలు ఏర్పాడ్డాయి. ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు నిలుస్తుండటం అక్కడి ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులకు నచ్చడం లేదు. దీంతోనే అమెరికాను టార్గెట్ చేసి దాడులు చేశారని తెలుస్తోంది. అక్టోబర్ మధ్య నుంచి ఇరాక్, సిరియాలోని ఇతర ప్రాంతాల్లో అమెరికన్, సంకీర్ణ దళాలపై ఇరాన్ అనుకూల శక్తులు రాకెట్లు, డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నిరోధించేందుకు ఇరాక్‌లో దాదాపుగా 2500 మంది, సిరియాలో 900 మంది యూఎస్ సైనికులు ఉన్నారు.
Read Also: Mahua Moitra: “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో పార్లమెంట్ నుంచి ఎంపీ మహువా మోయిత్రా బహిష్కరణ
గత వారం ఇజ్రాయిల్-హమాస్ సంధి ఒప్పందం ముగియడంతో ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలు అమెరికా, సంకీర్ణ బలగాలపై దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఈ దాడులు ఇరాక్ లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ అనే గ్రూపు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దాడులకు వ్యతిరేకంగా యూఎస్ దళాలు ఇరాన్, సిరియాల్లోని పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీ, యూఎస్ విదేశాంగా కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌తో మాట్లాడిన తర్వాత రోజు అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి జరగడం గమనార్హం.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపింది. అంతేకాకుండా 240 మందిని బందీలుగా చేసుకుంది. ఇటీవల సంధి ఒప్పందంలో భాగంగా కొందరు బందీలను హమాస్ విడుదల చేస్తే.. ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లు విడిచిపెట్టింది. అయితే సంధి ఒప్పందం ముగియడంతో మళ్లీ ఇజ్రాయిల్ బలగాలు గాజా స్ట్రిప్‌లో హామాస్ ఉగ్రసంస్థ లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయిల్ దాడుల్లో 17 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.