ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో గడుపుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. గాయపడినవారిలో జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్‌కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరోవైపు సిరియాలో సోమవారం…
ICC: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
Hamas: గాజా యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయిల్ బందీలు-ఖైదీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ యాక్టింగ్ గాజా చీఫ్ ఖలీల్ అల్ హయ్యా బుధవారం అల్ అక్సా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Isaral-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ కీలక నేతల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పర్యటించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతానికి నెతన్యాహూ వెల్లడం ఇదే మొదటిసారి.
Israel-Hamas War: ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో బాంబు దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో పీఎం నెతన్యాహు గానీ.. ఆయన కుటుంబ సభ్యులు గానీ లేరని.. అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Israeli Airstrikes : ఇజ్రాయెల్ డమాస్కస్ పశ్చిమ శివార్లలో, రాజధాని శివారులో రెండు వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. డమాస్కస్‌లోని మజే పరిసరాల్లో, రాజధానికి వాయువ్యంగా ఉన్న ఖుద్‌సయా శివారులో వైమానిక దాడుల్లో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. నేలమాళిగను ఢీకొన్న క్షిపణి ధాటికి ఐదు అంతస్తుల భవనం దెబ్బతింది. సిరియాలోని ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్టు గ్రూప్‌కి చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైట్‌లు, కమాండ్ సెంటర్‌లపై దాడి…
లెబనాన్‌లోని హిజ్బుల్లా యొక్క రద్వాన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ ముస్తఫా అహ్మద్ షాహదీ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ముస్తఫా అహ్మద్ షాహదీ ఇజ్రాయెల్‌పై అనేక తీవ్రవాద దాడులకు పురికొల్పినట్లుగా గుర్తించారు.
హమాస్‌కు కొత్త చీఫ్ వచ్చేశాడు. హమాస్ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత హమాస్‌కు కొత్త లీడర్ వస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా హత్యకు గురయ్యాడు.
Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్‌ల సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి.
Israel: ఇజ్రాయిల్-హమాస్ వార్ ప్రారంభమైనప్పటికీ నుంచి పలువురు జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, ఆరుగురు ‘అల్ జజీరా’ జర్నలిస్టులకు పాలస్తీనా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది.