Israel PM Netanyahu: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంపై టెల్ అవీవ్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ మా ప్రభుత్వ టార్గెట్ ను సాధించకుండా నిరోధించిందని చెప్పుకొచ్చారు. హమాస్ చెరలో ఉన్న బందీలను తప్పకుండా తీసుకు వస్తాం.. సాధ్యమైనంత వరకు విడుదలకు కృషి చేస్తామన్నారు. 60 రోజుల పాటు ఉన్న కాల్పుల విరమణలో బందీల రిలీజ్ జరగకపోతే హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తామని హెచ్చరించాడు. అలాగే, ఇరాన్‌పై విజయం తర్వాత హమాస్‌మై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాతో చర్చించారు.. అందులో భాగంగానే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది.. చర్చల తర్వాత 60 రోజుల పాటు కాల్పుల విరమణకు రెడీగా ఉన్నామని చెప్పామని నెతన్యాహు వెల్లడించారు.
Read Also: IMD Report: రైతులకు బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు వానలు లేనట్టే..?
ఇక, గాజాలో సైనికులను తొలగించడం, బంధీలను విడుదల చేయడం లాంటి అంశాలపై ట్రంప్ తో జరిగిన చర్చలో ప్రస్తావించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. రెండు నెలల సమయంలో ఇవన్నీ జరిగితే మేము మళ్లీ దాడులు చేయం.. ఒకవేళ హమాస్ మళ్లీ కాల్పులు విరమణను ఉల్లంఘిస్తే.. మాత్రం, ఈసారి మా దాడులు మరింత స్ట్రాంగ్ గా ఉంటాయన్నారు. ఈ భూమిపై హమాస్‌ను లేకుండా చేసి ఇజ్రాయెల్ భద్రతను పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. టెర్రరిజంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు గొప్ప విజయాలను నమోదు చేసుకుంది.. ఇజ్రాయెల్ యోధుల ధైర్యసాహసాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు.
Prime Minister Benjamin Netanyahu from Washington:
"This is the last day of a historic visit following the historic victory in the war against Iran. What was agreed between President Trump and me, regarding issues related to Gaza, the region, and even beyond the region, will be… pic.twitter.com/cunQHAgtbB
— Mossad Commentary (@MOSSADil) July 10, 2025