క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ చిత్తుచేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సోమవారం జరిగిన మూడో వన్డేలో ప్రొటీస్‌పై 69 పరుగుల తేడాతో ఐరిష్ జట్టు గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఐర్లాండ్ 1-2తో ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.…
Ireland vs South Africa: ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఐర్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో 2 మ్యాచ్ ల టీ20 సిరీస్ సమంగా 1-1తో ముగిసింది. తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఈ విజయంలో ఐర్లాండ్ తరఫున ఇద్దరు…