Iran Nuclear Program: టెహ్రాన్‌లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు,…
Iran Russia Nuclear Deal: ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అతలాకుతలం అయిన ఇరాన్ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. తాజాగా ఈ దేశానికి రష్యా దన్నుగా నిలించింది. ఇంతకీ మాస్కో ఇరాన్‌కు ఏ విధంగా దన్నుగా నిలిచిందని ఆలోచిస్తున్నారా.. ఇరాన్‌లో చిన్న అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి రష్యా ముందుకు వచ్చింది. మాస్కోలో బుధవారం రష్యన్ అణు సంస్థ రోసాటమ్ అధిపతి అలెక్సీ లిఖాచెవ్, ఇరాన్ అణు అధిపతి మొహమ్మద్ ఇస్లామీ ఈ ఒప్పందాలపై అధికారికంగా సంతకాలు చేశారు. రోసాటమ్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పన్ను…
అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలను నాశనం చేశామని అమెరికా పేర్కొంది. కానీ ఇరాన్ తమకు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. Also Read:Hormuz Strait: ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇదిలా ఉండగా, అనేక…
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు. ఇరాన్‌లోని పర్వతాల కింద 80 శాతం లోతులో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుఎస్ బి-2 బాంబర్…
ఇరాన్ సైనిక, అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో చేరాలా వద్దా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా డిమాండ్లకు సంబంధించి దౌత్యం కోసం ట్రంప్ ఇప్పటికీ ఒక అవకాశాన్ని చూస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. “ఇరాన్‌తో సమీప భవిష్యత్తులో చర్చలు జరిగే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఆధారపడి, రాబోయే రెండు వారాల్లో నేను నా…
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్‌లోని…
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది.
ఇరాన్ ఇజ్రాయెల్‌పై అనేక క్షిపణులను ప్రయోగించింది. దీని కారణంగా ఇజ్రాయెల్ పౌరులు సురక్షితమైన ప్రదేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ దాడి తర్వాత ఇరాన్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి వరకు ఈ దాడి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కీలక ప్రకటన చేశారు.