అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలను నాశనం చేశామని అమెరికా పేర్కొంది. కానీ ఇరాన్ తమకు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు.
Also Read:Hormuz Strait: ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మూసివేత..
ఇదిలా ఉండగా, అనేక దేశాలు తమ అణ్వాయుధాలను నేరుగా ఇరాన్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ పేర్కొన్నారు. అమెరికా దాడి తర్వాత, మెద్వెదేవ్ డోనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. శాంతిని ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ అమెరికాను మధ్యప్రాచ్యంలో యుద్ధంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా దాడిని ఆయన ప్రశ్నించగా, ఇరాన్ సైట్‌కు అతితక్కువ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోందని అన్నారు.
Also Read:Vijay Deverakonda: నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!
మెద్వెదేవ్ అమెరికాను సవాలు చేస్తూ, అణు పదార్థాల సుసంపన్నత ఇంకా కొనసాగుతోందని, కానీ భవిష్యత్తులో అణ్వాయుధాల ఉత్పత్తి కొనసాగుతుందని ఇప్పుడు మనం బహిరంగంగా చెప్పగలమని అన్నారు. అనేక దేశాలు తమ అణ్వాయుధాలను ఇరాన్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ దేశాలలో ఎవరు ఉన్నారో మెద్వెదేవ్ చెప్పలేదు. ఇరాన్ మంత్రి అరాఘ్చి మాట్లాడుతూ.. రష్యా ఇరాన్‌కు మిత్రుడని, మేము ఎల్లప్పుడూ ఒకరినొకరం సంప్రదిస్తాము అని అన్నారు. పుతిన్‌తో ఒక ముఖ్యమైన సంప్రదింపులు జరపడానికి నేను రేపు మాస్కో వెళ్తున్నాను. అమెరికా దాడులు అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.