భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు.…
యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
అఖిల భారత అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసుల, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్) వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. డీజీపీగా రవిగుప్తాను కొనసాగించింది. రోడ్‌సేఫ్టీ డీజీగా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్‌చంద్ర.. కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది.