ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్సుకు ఆర్థిక సాయం జగన్ సర్కార్ చేయనుంది.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. 2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో 14,600 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.
IAS, IPS Transfers : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు సూచన చేసింది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోర్టును కేంద్రం కోరింది.
Tattoo : పచ్చబొట్టు కారణంగా ఐపీఎస్ కావాలన్న యువకుడి జీవితం ముగిసిపోయింది. ఢిల్లీలో రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. చేతిపై పచ్చబొట్టు వేయించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?గుంటూరు జిల్లాకు చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేయడమే కాకుండా.. తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ల పాటు తిప్పుకోవడం దారుణం అన్నారు పవన్. Read Also: CM Jagan: గృహనిర్మాణ శాఖపై కీలక సమీక్ష రెవెన్యూ వ్యవస్థ తీరుతో…
జేసీ బ్రదర్స్ అంటేనే సంచలన వ్యాఖ్యలకు మారుపేరు.. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తుంటారు.. అయితే, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష కూడా ఖరారు అయ్యింది.. క్షమాపణలు చెప్పడంతో ఆ శిక్షలను సేవగా మార్చేసింది హైకోర్టు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా అందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్న…
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం… మొదట ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని విషయం తెలిసిందే.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.. అయితే, తాజాగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.. అయితే, గౌతమ్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి విషయంలో ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. ఐపీఎస్ హోదాలో ఉండగా రాజ్యాంగబద్ద పదవి చేపట్టొచ్చా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతోంది ప్రభుత్వం.. రాజీనామా చేసిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గిరీ…
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.…
అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు రాశారు. అంతేకాదు, మధ్యప్రదేశ్, మేఘాలయ, బీహార్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కూడా సవరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని…
ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు అయ్యారు. విజయనగరం, నెల్లూరు, తూ.గో, కృష్ణా జిల్లాల ఎస్పీల బదిలీలు అయ్యారు. పదోన్నతిపై దిశ డీఐజీగా బి. రాజకుమారి నియామకం కాగా… విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. అలాగే నెల్లూరు ఎస్పీగా సీహెచ్. విజయా రావు… తూ.గో. ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు నియామకం అయ్యారు. కృష్ణా ఎస్పీగా సిద్దార్థ కౌశల్ బదిలీ కాగా… గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండరుగా అద్నాన్ నయీమ్ అస్మి నియామకం అయ్యారు. read also : కృష్ణా…