అఖిల భారత అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసుల, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్) వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్‌లోని సివిల్ సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థను సంస్కరించి.. వాటిని కొత్తగా ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యవస్థలో నీతి, నిజాయితీ తగ్గుతున్నట్టు భావిస్తున్ననని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న పలు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
READ MORE: Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
ఆయన ప్రచురించిన ‘జస్ట్ ఏ మెర్సినరీ?: నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పుస్తకంలో ఐఏఎస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఎప్పుడో బ్రిటీష్‌వారు తయారు చేసిన ఐఏఎస్ అనే స్టీల్ ఫ్రేమ్ ఇప్పుడు తుప్పు పట్టిందని అందులో వ్యాఖ్యానించారు. అలా అని దాన్ని బయటకు విసిరేయమని కాదని అన్నారు. దానిని సరిచేసి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐఏఎస్‌ల్లో ఉన్న లింగ వివక్ష గురించి ఆయన ప్రస్తావించారు.
కాగా.. అఖిల భారత అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర కొలువులకు ఎంపిక కోసం యూపీఎస్సీ ఏటా మూడు దశల్లో సివిల్స్ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశలు ఉంటాయి. లక్షల మంది పోటీ పడితే.. వందల మంది విజయం సాధిస్తుంటారు. దేశంలోని ఉన్నతాధికారులుగా వీరినే నియమిస్తారని తెలిసిందే.