ఈ కార్యక్రమంలో కింగ్ కోహ్లీ అనుభూతి ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు.. తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ మీరంతా ప్రశాంతంగా ఉండండి.. మేము త్వరగా చెన్నైకి వెళ్లాలి.. మీరు ( యాంకర్ ను ఉద్దేశించి ) నన్ను కింగ్ అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటుంది.. జస్ట్ విరాట్ అని పిలవండి అని కోహ్లీ పేర్కొన్నారు.
టీమిండియా సారథి, రోహిత్ శర్మ అభిమానులు లక్షలాది మంది ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 8 లక్షల మంది ఎమ్ఐ టీమ్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించక ముందు ఇన్ స్టాలో ముంబైకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండేది.