టీమిండియా సారథి, రోహిత్ శర్మ అభిమానులు లక్షలాది మంది ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 8 లక్షల మంది ఎమ్ఐ టీమ్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించక ముందు ఇన్ స్టాలో ముంబైకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండేది.. కానీ ప్రస్తుతం 12.5 మిలియన్లకు ఆ సంఖ్య తగ్గింది. మరోవైపు ట్విటర్ లో కూడా దాదాపు 5 లక్షల మంది ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో చేశారు. ఈ రెండు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కలిపి దాదాపు 13 లక్షల మంది ముంబై టీమ్ కి గట్టి షాకిచ్చారు.
Read Also: Road Accident: అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అయితే, ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యాను తదుపరి ఐపీఎల్ సీజన్‌కు కెప్లెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, గత కొద్ది రోజుల క్రితమే హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ముంబై టీమ్ ట్రేడ్ చేసుకుంది. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ తన టీమ్ కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించి రికార్డ్ సృష్టించాడు. ఇక, ,చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనితో కలిసి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ తన 14 సంవత్సరాల నాయకత్వంలో సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.
Read Also: COVID-19: కరోనాతో భర్త మృతి.. అతని వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య..
ఇక, రాబోయే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా ఉండాలని కోరుకునే ముంబై అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో.. సోషల్ మీడియాలో MI అకౌంట్లను అన్‌ఫాలో చేస్తూ.. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని అనుకుంటే.. ఇలా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారా అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రోహిత్ శర్మ అభిమానులైతే.. ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెడుతున్నారు.
ట్విట్టర్ లో ShameonMI అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది.