ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్-34లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ 7 గంటలకు జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ లేట్ అవుతోంది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పారు.
ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సీఎస్‌కేని వారి సొంత మైదానంలో ఓడించింది. చెన్నై కంచు కోటను కూడా బద్దలు కొట్టగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ…