ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31ని గడువుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్ 2025 కోసం ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఆరుగురినినేరుగా రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో దక్కించుకోవచ్చు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించకున్నా.. ప్లేయర్స్ లిస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గరుని నేరుగా రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ మొదటి మూడు ప్రాధాన్యత ప్లేయర్లుగా ఖరారు చేసింది. అయితే ఈ ముగ్గురికి ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ నిర్ణీత ధర కంటే ఎక్కువగా ఆఫర్ చేసిందని సమాచారం. రూ.23 కోట్లు, రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిని కూడా రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్ సమద్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోనుందట.
Also Read: RR Retention List: ఆరుగురిని రిటైన్ చేసుకున్న రాజస్థాన్.. మొదటి ఎంపిక ఎవరంటే?
అయిదుగురు క్లాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ ఉండటంతో కీలక ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకోక తప్పదు. వీరిలో కొందరిని వేలంలో తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. సుందర్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ రెండో టెస్టులో సత్తాచాటిన సుందర్‌కు చోటు లేకపోవడం నిరాశ కలిగించే అంశమే. మరికొన్ని గంటల్లో ఫుల్ డీటెయిల్స్ తెలియరానున్నాయి.