ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. 218 పరుగుల ఛేదనలో ఆర్ఆర్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.షిమ్రాన్ హెట్మయర్ (52; 32 బంతుల్లో 4×4, 3×6), సంజు శాంసన్ (41; 28 బంతుల్లో 4×4, 2×6) పోరాడారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8×4, 3×6) దంచికొట్టాడు. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్‌కు మరో షాక్ తగిలింది. కెప్టెన్ సంజూ శాంసన్ సహా ఆటగాళ్లందరికీ భారీ జరిమానా పడింది.
Also Read: 2028 Olympics: ఒలింపిక్స్‌లో ఆరు క్రికెట్ టీమ్స్.. అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయం లోగా పూర్తి చేయడంలో విఫలమైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల ఫైన్ విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన సభ్యులకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించింది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి కాబట్టి.. భారీ జరిమానా పడింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కూడా ఆర్ఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఆ మ్యాచ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.