టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా మనోడి ఆటకు ఫాన్స్ ఉన్నారంటే.. అతడి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. విరాట్ కేవలం ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే. ప్రస్తుతం విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 27.1 కోట్ల మంది, ఎక్స్‌లో 6.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అత్యధిక ఫాలోవర్లు కలిగిన విరాట్ కోహ్లీతో ప్రచారం చేయించేందుకు టాప్ బ్రాండ్లన్నీ పోటీపడుతుంటాయి. అందుకే విరాట్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. బ్రాండ్ ప్రమోషన్ పోస్టులే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కోహ్లీ ప్రమోషన్ కంటెంట్‌ను పోస్ట్ ఫీడ్ నుంచి తొలగించేశాడు. ఇందుకు కారణం ఏంటో తెలియదు గానీ.. ప్రస్తుతం కింగ్ ఇన్‌స్టాలో వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. క్రికెట్, జిమ్ కసరత్తులు, సతీమణి అనుష్క శర్మ, కుటుంబంతో దిగిన ఫొటోలతో పాటు వీడియోలకు సంబంధించిన పోస్టులు మాత్రమే ఉన్నాయి.
Also Read: Virat Kohli: ఎప్పుడూ అహానికి పోను.. విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!
అయితే ప్రమోషన్ కంటెంట్‌ను విరాట్ కోహ్లీ పూర్తిగా తొలగించలేదు. యాడ్ కంటెంట్‌ను రీల్స్ సెక్షన్‌లోకి మార్చాడు. విరాట్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యాడ్ వీడియోలు అన్ని ఇప్పుడు రీల్స్‌లో కనబడుతున్నాయి. ఇందుకు గల కారణాన్ని మాత్రం విరాట్ టీమ్ ఇంకా వెల్లడించలేదు. యాడ్ కంటెంట్ లేకపోవడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాడ్ కంటెంట్‌ను రీల్స్ సెక్షన్‌లోకి మార్చిన విరాట్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక కింగ్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు.