ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో శుక్రవారం నాడు బెంగళూరులోని ఎం చిన్నస్వామిలో జరిగే మ్యాచ్ టెన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, తన రెండో గేమ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరు జట్టు ఇప్పటికే పంజాబ్ కింగ్స్ పై ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేయడంతో..…
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఢిల్లీకి 186 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. రియాన్ పరాగ్ అద్భుతమైన ముగింపుతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది.
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్‌తో బరిలోకి దిగనుంది.
మర్చి 28, 2024 గురువారం జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2024 తొమ్మిదో మ్యాచ్ లో భాగంగా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిషబ్ పంత్ తో ఇద్దరు వికెట్ కీపర్ల సమరం జరగబోతుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో రాయల్స్ ఈ గేమ్ లోకి అడుగుపెట్టనుంది. కెప్టెన్ శాంసన్ అజేయ అర్ధ సెంచరీతో వారి బ్యాటింగ్ తో ఫామ్…
బుధవారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ తలబడ్డాయి. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి హైదరాబాద్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఆకాశమ హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన టీం గా రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష…
ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై SRH గెలుపొందింది. 277 పరుగులు చేసిన హైదరాబాద్.. ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 278 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఒకానొక క్రమంలో.. ఇంత భారీ లక్ష్యాన్ని ముంబై చేజ్ చేస్తుందా అనే సందేహం కలిగింది. ఈ…
ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఇంతకుముందు ఆర్సీబీ (263) పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (62) పరుగులతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. మయాంక్ అగర్వాల్ (11) పరుగులు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔట్ కాగా... మరో బ్యాటర్ ట్రేవిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలువాలన్న కసితో ఇరుజట్లు చూస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసమని ఇప్పటికే స్టేడియానికి ఇరుజట్ల చేరుకున్నాయి. కాగా.. స్టేడియంకు వెళ్లే ముందు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తెలుగులో మాట్లాడుతూ మేము వచ్చేశాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు అంటూ తెలిపారు.…