ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఇంతకుముందు ఆర్సీబీ (263) పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (62) పరుగులతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔటయ్యాడు.
Pawan Kalyan: పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు.. పవన్ హెచ్చరిక
ఆ తర్వాత బరిలోకి దిగిన అభిషేక్ శర్మ (63) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఆ తర్వాత మార్క్రమ్ (42) పరుగులు చేశాడు. ఇక.. క్లాసెన్ మాత్రం ముంబై బౌలర్లను చీల్చి చెండాడు. కేవలం 34 బంతుల్లో 80 పరుగులతో చెలరేగాడు. ఇక.. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, కోయెట్జీ, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు. మిగిలిన బౌలర్లంతా పరుగులు ధార పోశారు.
Mood of the Nation: బీజేపీకే జై కొడుతున్న 79 శాతం దేశ ప్రజలు.. తాజా సర్వేలో వెల్లడి..